రోజు మ‌నం రాగి చెంబులో నీళ్లు తాగితే ఎన్ని ప్ర‌యేజ‌నాలున్నాయో తెలుసా..?

0

ఇప్పుడు అంతా ప్లాస్టిక్ యుగం నడుస్తోంది. ఏం తిన్నా, ఏం కొన్నా అది ప్లాస్టిక్ తోనే ముడిపడి ఉంటోంది. అదే మ‌న తాతా , ముత్తాత రోజుల్లోనైతే ఇళ్లల్లో ఎక్కడ చూసినా రాగి పాత్రలే కనిపించేవి. అప్పట్లో రాగి పాత్రలు ఇంట్లో ఉంటే రోగాలు రావు అనేవారు. ఇంతకు రాగినే ఎందుకు అన్నారో తెలుసా! రాగికి ఆంటి బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది.

daily we drink the copper vessel Water

రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం లేదు. దీంతో వాటిల్లో నిల్వ ఉంచిన పదార్థాలు చెడిపోయే ప్రమాదం తక్కువ. మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రల్లో నీళ్ళు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా అరుదు. అందుకే పాత రోజుల్లో రాగిబిందెలు వాడేవారు. ఇప్పుడు రాగి చాలా ఖరీదైన లోహం. అందుకే అన్ని వస్తువులంటే కొనలేంకాబట్టి ఓ చెంబునైనా తీసుకుని అందులో నీళ్లు పోసుకుని తాగుతుండాలి. ఆ ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

1.పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగితే పెద్ద పేగు శుభ్రపడి తినే ఆహారంలోని పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది.
2.శరీరంలో కొత్త రక్తం తయారుచేసి కండరాల్లో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
3రక్తాన్ని శుద్ధి చేయడం మూలాన మలినాలు పోతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది.
4.శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది. ఈ చర్యవల్ల శరీరంలో ద్రవపదార్ధాలను కోల్పోనీకుండా ఇన్‌ఫెక్షన్‌ను దరి చేరనీయదు.
5.అరగంట లోపు సుఖవిరేచనం అగుతుంది. మలబద్దకం, తేపులు పోతాయి.
6.గ్యాస్ నిర్మూలించబడుతుంది. కడుపు ఉబ్బరం, కడుపు మంట నివారించ బడుతుంది.

Share.

Comments are closed.