5 సెకన్లలో ఒక రంగును ఎంచుకోండి మీ స్వభావాన్ని తెలుసుకోండి 

0

Choose a color in 5 seconds to learn your natureరంగులు చూడగానే ఆకర్షణకు లోనవుతాం. రంగులకీ, మనసుకీ చాలా దగ్గర సంబంధం ఉంది. మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది.. ఫేవరెట్‌ కలర్‌ అంటే మన వ్యక్తిత్వమే! ఇష్టపడే రంగును బట్టి మనిషిని అంచనా వేయొచ్చు. ఆ రంగులకు సంబంధించిన లక్షణాలు మనిషిలో కనిపిస్తాయి. అంటే అభిప్రాయాలను నిర్ణయించడంలో రంగులు కీలక పాత్ర పోషిస్తాయి. మనకిష్టమైన రంగును చూసినప్పుడు మనసుకు ప్రశాంతత, మానసిక ఆనందం కలిగేది అందుకే!!

అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్న వారు ముదురు రంగులను ఇష్టపడతారు. తటస్థ వైఖరి ఉన్న వారు సాదా రంగులు ఇష్టపడతారు. హుందాగా ఉండాలనుకునే వారికి లేతరంగులే నచ్చుతాయి. సృజనాత్మకంగా ఆలోచించేవారు ఆఫ్‌బీట్‌ కలర్స్‌నే ఎక్కువగా ఇష్టపడతారు. అలాంటివారు ఎప్పుడూ కొత్తదనాన్ని, ప్రయోగాలను కోరుకుంటారు. సహజంగా మహిళలు బ్రైట్‌, లైవ్‌లీ రంగుల్ని ఇష్టపడతారు. ఈ రకం రంగులు సున్నిత మనస్తత్వాన్ని తెలియచేస్తాయి. మనం ఇష్టపడే రంగు మన మానసిక, శారీరక స్థితిగతులను చెబుతాయి.Choose a color in 5 seconds to learn your nature

తేల్చుకోలేక పోతున్నారా?
అందరికీ ఫేవరేట్‌ కలర్‌ అంటూ ఉంటుంది. అయితే కొందరు దాన్ని గుర్తిస్తే మరికొందరు గుర్తించలేని అయోమయంలో ఉంటారు. దీంతో ఒకటి కంటే ఎక్కువ రంగులను ఇష్టపడుతుంటారు. వ్యక్తి కలర్‌ను ఎంచుకోవడం ద్వారా వారిలో ఆ స్వభావం ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది మల్టీకలర్స్‌ ఇష్టపడతారు. వారిలో విభిన్న వ్యక్తిత్వాల మేళవింపు కనిపిస్తుంది. ఒకే రంగును ఇష్టపడే ఏ ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉండకపోవచ్చు కూడా. చాలా వరకు మాత్రం ఒకే రంగును ఇష్టపడే వ్యక్తుల మధ్య స్నేహం చిగురిస్తుందని అంటున్నారు సైకాలజిస్టులు.

 

Choose a color in 5 seconds to learn your nature

వీక్నెస్‌లూ చెప్పేస్తాయ్‌
అలాగే కొందరికి కొన్ని రంగులు అస్సలు నచ్చవు. అలాంటి రంగులు మీలో ఉన్న అశక్తత, వీక్‌నెస్‌ లక్షణాలను గూర్చి తెలియజేస్తాయి. అంటే కేవలం ఇష్టమైన రంగు వల్లనే కాదు ఇష్టం లేని రంగును బట్టి కూడా మీరు ఎలాంటి వ్యక్తులో, మీలో ఏమేం లోపాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇష్టపడే రంగును బట్టి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు. మనిషి ‘రంగు’ను బైట పెట్టే ఆ కలర్స్‌, వాటి లక్షణాల గురించి తెలుసుకోండి!

ఎరుపు రంగు:

Choose a color in 5 seconds to learn your nature
ఎరుపు రంగు శుభానికి సంకేతం. అలాగే విప్లవానికి కూడా గుర్తు. ఎరుపు రంగు ఇష్టపడే వ్యక్తులు బహిర్ముఖులై, బాహాటత్వంతో ఉంటారు. ఎప్పుడూ ఆశావాద దృక్పథంతో ఉంటారు. ఏదైనా సరే చేతల్లో చూపించాలనుకుంటారు. పోటీ తత్వం వీరికి ఇష్టం. ఎప్పుడూ ఏదో రకమైన లక్ష్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతే కాదు ఈ రంగు ఇష్టపడే వ్యక్తులకు కొంచెం కోపం పాలు ఎక్కువే. నచ్చని పనికి వెంటనే ఎదురు తిరుగుతారు. వాదన అంటే వీరికి మహా ఇష్టం. తమ వాదనే నెగ్గాలనే పట్టుదలతో ఉంటారు. అయితే క్షణికమైన కోపం వీరి లక్షణం. వెంటనే కోపం తెచ్చుకోవడం, అసహనం వీరిలో నెగెటివ్‌ లక్షణాలు. మంచి నాయకత్వ లక్షణాలు, నిజాయితీ వీరి పాజిటివ్‌ లక్షణాలు.

తెలుపు రంగు:

Choose a color in 5 seconds to learn your nature
తెలుపు రంగు శాంతికి, స్వచ్ఛతకి సంకేతం. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు శాంతి కాముకులు. ఎవరిమీదా ఆధారపడకుండా ఉండాలనుకుంటారు. ఎవ్వరినీ నొప్పించకుండా తమపని తాము చేసుకు పోయే లక్ష ణాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ వర్తమానం గురించి కాక భవిష్యత్తు గురించే ఆలో చిస్తారు. ఆశావాద దృక్పథంలో ఉన్నా సరే ప్రాక్టికల్‌గా ఆలోచించి మరీ ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అందుకు తగినట్లుగానే పనులు చేసుకుంటూపోతారు. జీవితంలో వచ్చే కష్టసుఖాలను బ్యాలెన్స్‌ చేసుకోవడంలో వీరు నేర్పరులు. సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఏపని చేసినా పాజిటివ్‌గా ఉంటూ ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. అయితే వీరు చాలా సులభంగా మూడ్‌ను మార్చేసుకుం టారు. ఏదైనా విషయంలో మూడ్‌ పాడైతే వీరిని మామూలు స్థితికి తీసుకు రావడం చాలా కష్టం. దీంతో చాలా మంది వీరిని అర్థం చేసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. కొన్ని సార్లు వీరు నమ్మే సిద్ధాంతాల పట్ల పట్టుదలగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

నలుపు రంగు:

Choose a color in 5 seconds to learn your nature
హోదాకి, హుందాకి చిహ్నం నలుపు రంగు. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు. ఆధిపత్యాన్ని వ్యతిరేకి స్తారు, కానీ తమ దగ్గరికి వచ్చేసరికి అదే ఆధిపత్యాన్ని కోరుకుంటారు. పట్టుదల కలిగి ఉండి, ఎమోషనల్‌గా, స్ర్టాంగ్‌గా ఉంటారు. ఎలాంటి సందర్భాలలో అయినా సరే తమని తాము కంట్రోల్‌లో ఉంచుకుంటారు. ప్రతి విషయాన్ని తమలోనే దాచుకుంటారు. అంత ఈజీగా బయట పడరు. దీనివల్ల కొన్నిసార్లు ముఖ్యమైన సంబంధ బాంధవ్యాలు వదులుకునే పరిస్థితి వస్తుంది. అందరితో త్వరగా కలిసిపోతారు. కొత్తగా వచ్చిన ట్రెండ్స్‌ను ఫాలో అవడం అంటే వీరికి చాలా ఇష్టం.

పసుపు రంగు:

Choose a color in 5 seconds to learn your nature
సంతోషానికి చిరునామా పసుపు రంగు. ఆ లక్షణానికి తగినట్లుగానే పసుపు రంగు ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కొత్తకొత్త ఆలోచనలు చేస్తుంటారు. అందరిలా ఉండడం కన్నా తాను ప్రత్యేకమైన వ్యక్తిని అనిపించుకోవాలనుకోవడం వీరికి చాలా ఇష్టం. ప్రతి విషయాన్ని గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఉంటుంది. చాలా మంది స్నేహితులు ఉంటారు. కొన్నిసార్లు త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో మంచి చేసినా కొన్ని సందర్భాల్లో చిక్కుల్లో పడేసే అవకాశాలున్నాయి. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు చూడడానికి మోడ్రన్‌గా కనిపించినా వీరికి పాతకాలపు ట్రెండ్స్‌ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. ఎలాంటి సందర్భాన్నయినా తేలికగా హ్యాండిల్‌ చేయడం వీరి ప్రత్యేకత. వీరు చాలా ఎమోషనల్‌. కానీ ఏ ఫీలింగూ బయటకి కనపడనివ్వరు. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. దీనివల్ల మాటతూలే ప్రమాదమూ లేకపోలేదు. త్వరగా నిర్ణయాలు మార్చుకోవడం వీరిలో ఉండే నెగెటివ్‌ పాయింట్‌.

నీలిరంగు:

Choose a color in 5 seconds to learn your nature
నీలిరంగు ఇష్టపడే వ్యక్తులు చాలా నమ్మదగిన వ్యక్తులు అనుకోవచ్చు. ప్రతి విషయం లోనూ ముందు బాగా ఆలోచించి మాట్లాడటం వీరి ప్రత్యేకత. చాలా నెమ్మదస్త్తులు. చూడటానికి సిన్సియర్‌గా, సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తారు. ప్రతి విషయంపై కచ్చితత్వం, సెల్ఫ్‌ కంట్రోల్‌ కలిగి ఉంటారు. చాలా తక్కువ మందితో మాట్లాడతారు. వారినే పూర్తిగా నమ్ముతారు. వీరు ఇష్టపడే వాళ్లు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సరే వాళ్ల మూడ్‌ను మార్చేసి మళ్లీ మామూలు స్థితికి తీసుకువచ్చే శక్తి వీరిలో ఉంటుంది. జాలి, దయ కలిగి ఉండడం వీరిలో ఉండే అదనపు లక్షణాలు. కానీ కొన్నిసార్లు ఆలోచనా రహితంగా అనర్హుల మీద జాలి కురిపించడం వల్ల నష్టపోయే ప్రమాదమూ లేకపోలేదు. ప్రతీ చిన్న విషయానికి అనవసర ఆందోళన, భయం వీరిలో మార్చుకోవాల్సిన విషయాలు.

గులాబీరంగు:

Choose a color in 5 seconds to learn your natureగులాబీ రంగు ప్రేమకు సంకేతం. ఈ రంగు ఇష్టపడే వ్యక్తులు ఎప్పుడూ ఇతరుల పట్ల ప్రేమ భావంతో ఉంటారు. అంతేకాదు చాలా సున్నిత మనస్కులు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే నొచ్చుకుంటారు. ఎవరినైనా సరే మృదుభాషణంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి విషయాన్ని పాజిటివ్‌ దృక్పథంతో ఆలోచిస్తారు. ప్రతి వ్యక్తిలో మంచినే చూస్తారు తప్ప చెడు విషయాలను పట్టించుకోరు. బయట వ్యక్తులకు వీరు అపరిపక్వ మనస్తత్వం గలవారుగా అగు పిస్తారు. కానీ ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే సత్తా వీరిలో ఉంటుంది.

ఆకుపచ్చ రంగు:

Choose a color in 5 seconds to learn your nature
ఆకుపచ్చ రంగును ఇష్టపడే వ్యక్తులు చాలా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఊహల సామ్రాజ్యంలో ఉండడం వీరికి నచ్చని పని. జాలి, ఉదారభావం లాంటి భావాలనన్నింటినీ ఎక్కువగా ప్రయోగించకుండా వాటి ని అదుపులో ఉంచుకుంటారు. మనసులో ఒకటి ఉంచుకుని బయట ఇంకొకలా మాట్లాడటం వీరికి రాదు. నచ్చని విషయాన్ని ఎదుటివాళ్లకి వెంటనే మొహమాటం లేకుండా చెప్పేస్తారు. వాదించడం అంటే వీరికి నచ్చని విషయం. రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా చాలా తొందరగా అమలుకు సాధ్యమయ్యే నిర్ణయాలను తీసుకుంటారు.

Share.

Comments are closed.