బాహుబలి తాతను తీస్తాం

0

Chiru pawan come together for the biggest Telugu industry

తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు గొప్ప సినిమా, భారీ విజయం, భారీ వసూళ్లు సాధించిన సినిమా ఏది అంటే….. అందరూ ముందుగా చెప్పేది బాహుబలి సిరీస్ సినిమాల గురించే. అయితే త్వరలో తాను బాహుబలిని మించే బాహుబలి తాత లాంటి సినిమా చేస్తానంటూ ఓ సినీ ప్రముఖుడు గొప్పలు చెప్పుకుంటున్నాడట.

ఆ ప్రముఖుడు మరెవరో కాదు… కళాబంధు, ప్రముఖ రాజకీయవేత్త, నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి అంటూ ఇండస్ట్రీలో ప్రచారం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ హీరోలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఓకే కావడంతో సుబ్బిరామిరెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, ఆ సంతోషంలోనే ఇలా గొప్పలకు పోతున్నారని టాక్.

Share.

Comments are closed.