చైతూ అభిమానులకి బర్త్ డే గిఫ్ట్ .. “సవ్యసాచి” ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

0

Chaitu savyasachi Movie first look released
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న “సవ్యసాచి” రెగ్యులర్ షూట్ నవంబర్ 8 నుంచి మొదలైన విషయం తెలిసిందే. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొన్న ఈ చిత్రం షూటింగ్ లో నిన్నటినుండి మాధవన్ కూడా జాయిన్ అయ్యారు. నాగచైతన్య సరసన బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ ఎగ్జయిటింగ్ థ్రిల్లర్ హై ప్రొడక్షన్ స్టాండర్డ్స్ తో రూపొందనుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. “మాధవన్ నిన్నటి నుంచి మా టీం లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ జరుగుతోంది. నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. మాధవన్ పాత్ర తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరువలేని స్థాయిలో ఉండబోతోంది” అన్నారు.

మాధవన్ మాట్లాడుతూ.. “మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. “సవ్యసాచి” టీం తో కలిసి వర్క్ చేయనుండడం ఎగ్జయిటింగ్ గా ఉంది. అందరం కలిసి ఒక ఔట్ స్టాండింగ్ ఫిలిమ్ చేయనున్నాం” అన్నారు. అలాగే.. రేపు (నవంబర్ 23) చిత్ర కథానాయకుడు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా సినిమాలో నాగచైతన్య లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

Share.

Comments are closed.