మ‌హా కుటుంబం!

0
biggest family of the world

biggest family of the world

 

మిజోరమ్‌ రాష్ట్రంలోని బక్తావంగ్‌ గ్రామానికి ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ఆ ఊర్లోని నాలుగంతస్తుల భవనంలో వందగదులుంటాయి. వాటిల్లో 181 మంది నివసిస్తున్నారు. ఇందులో ప్ర‌త్యేక‌త ఏంటీ అంటారా? వారంతా ఒక‌టే కుటుంబానికి చెందిన‌వారు. అవును ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబంగా ఘనతి కెక్కిన 72 ఏళ్ల జియోనా కుటుంబం ఈ భవనంలోనే నివసిస్తోంది.ఆ కుటుంబ పెద్ద పేరు జియోనా 39 మంది భార్యలను పెళ్లి చేసుకుని 94 మంది పిల్లల‌ను క‌న్నారు. ఆయనకు 14 మంది కోడళ్లు, 40 మంది మనుమలు, మనుమరాళ్లు ఉన్నారు.

 

ఒక్క కుటుంబంలోని నలుగురు వ్యక్తులే కలసి మెలసి ఉండని ఈ రోజుల్లో ఏకంగా ఇంతమంది భార్యలు, పిల్లలు, వారి పిల్లల పిల్లలు, కలసిమెలసియే కాకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవిస్తున్నారు. ఇంత‌మంది ఉన్న‌ప్ప‌టికీ వారంతా క‌లిసే ఉంటారు. ఒకే ద‌గ్గ‌ర వండుకుని తింటారు. వాళ్లింట్లో రోజుకు 50 కిలోల బియ్యం, 70 కిలోల మాంసం కావాలట. జియోనా పుట్టుకతోని ధనవంతుడు అవడం వల్ల అంత మందిని ధైర్యంగా పెళ్లి చేసుకోగ‌లిగాడు. వయస్సులో ఉండగా అందరి పోషణ బాధ్యత ఆయనే చూసుకోగా, ఇప్పుడు కుటుంబం పోషణకు కుటుంబంలోని సభ్యులంతా తలా ఓ చేయి వేస్తున్నారు. ఇప్పుడు ఈ కుటుంబానికి చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Share.

Comments are closed.