బాహుబ‌లికి జై కొట్టిన బార్క్‌!

0
Baahubali Top In Barc Ratings

Baahubali Top In Barc Ratings

టాలీవుడ్ బాహుబ‌లి, డార్లింగ్ ప్ర‌భాస్ టాలీవుడ్‌నే కాదు.. బాలీవుడ్‌ని సైతం దాటేశాడు. ఫేవ‌రెట్ హీరోల సినిమాలు టీవీలో వ‌స్తే చాలు.. అభిమానులు టీవీల‌కు అతుక్కుపోతారు క‌దా! ఈ మ‌ధ్య బాహుబ‌లి ద క‌న్‌క్లూజ‌న్ హిందీ ప్రీమియ‌ర్ టీవీలో వ‌చ్చింది.

ఆ త‌ర్వాత స‌ల్మాన్ ఖాన్ న‌టించిన ట్యూబ్‌లైట్‌, అక్ష‌య్ కుమార్ న‌టించిన టాయ్‌లెట్ ఏక్ ప్రేమ‌క‌థ సినిమాలు కూడా టీవీల్లో వ‌చ్చాయి. కానీ బాలీవుడ్ హీరోలను ప‌క్క‌కు పెట్టి మ‌న తెలుగింటి డార్లింగ్ సినిమాకే ఓటేశారు హిందీ ప్రేక్ష‌కులు. బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చి కౌన్సిల్ అదేనండీ.. బార్క్ తాజాగా విడుద‌ల చేసిన బార్క్ రేటింగ్‌లో బాహుబ‌లి2కి దేశ‌వ్యాప్తంగా 2.6 కోట్ల వ్యూస్ వ‌చ్చాయి. దీంతో పోలిస్తే ట్యూబ్‌లైట్ సినిమా కోటి 2ల‌క్ష‌ల వ్యూస్‌, టాయ్‌లెట్ సినిమాకు కోటి9 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి.

Baahubali Top In Barc Ratings

Baahubali Top In Barc Ratings

దీంతో పోలిస్తే బాహుబ‌లి రెండు రెట్లు ముందున్నాడు.  దీన్ని ప‌రిగ‌ణ‌లోనికి తీసుకున్న బార్క్ అత్య‌ధిక వ్యూస్ వ‌చ్చిన టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌గా బాహుబ‌లిని ప్ర‌క‌టించారు. బాహుబ‌లికి ఈ స్థాయి విజ‌యం ద‌క్క‌డం వెనుక జ‌క్క‌న రాజ‌మౌళి క‌ష్టం, ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, ర‌మ్య‌కృష్ణ ఇత‌ర న‌టుల శ్ర‌మ ఎంతో ఉంది. మొత్తానికి బార్క్ సైతం తెలుగోడికి జై కొట్టింది. జై బాహుబ‌లి.

Share.

Comments are closed.