షుగ‌ర్ ఉంద‌ని చ‌పాతీలు తింటున్నారా..? అయితే ఇది మీరు క‌చ్చితంగా తెలుసుకోవాలి..!

0

are you eating chapathis at night then know this factచాలా మంది గోధుమలు ఆరోగ్యానికి మంచిది అన్న నమ్మకంలో ఉంటారు. అందుకే చాలామంది లావు తగ్గాలనుకునే వాళ్లు గోధుమ పిండితో చేసే చపాతీలను ఎక్కువగా తింటుంటారు. అయితే గోధుమలతోనే ఆరోగ్యం అనేది పూర్తిగా నిజం కాదు అంటున్నారు పరిశోధకులు.

వరి లాగా గోధుమలు అంత త్వరగా జీర్ణం కావని, చాలా ఆలస్యంగా జీర్ణం అవుతాయని దీని వలన పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు విరేచనాలు, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయని, అవి గోధుమల వలన వచ్చినా, వాటిని గుర్తించడం కష్టమవుతుందని అంటున్నారు.అంతేకాకుండా… దీని వలన చికిత్స ఆలస్యం అయి సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

దీంతోపాటు గోధుమలు తీసుకోవడం వల్ల షుగరు అదుపులో ఉంటుందన్న విషయం కూడా శాస్త్రీయంగా రుజువు కాలేదని వారు అంటున్నారు. అందువల్ల గోధుమలనే పూర్తిగా తీసుకోకుండా కాలానుగుణంగా దొరికే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకుంటే తగినన్ని పోషకాలు లభించి ఆరోగ్యంగా ఉంటారని వారు చెబుతున్నారు.

Share.

Comments are closed.