భ‌ర్త మృతి వార్త‌నే న్యూస్‌లో చ‌దివి వినిపించింది ఈ యాంక‌ర్‌..!

0

మ‌నం ఎవ‌రమైనా మ‌న కుటుంబ స‌భ్యులు, సంబంధీకులు లేదా స్నేహితులు చ‌నిపోయార‌ని తెలిస్తేనే ఆ వార్త‌ను విని త‌ట్టుకోలేం. అమితంగా దుఃఖిస్తాం. కానీ ఆమె అలా కాదు. స్వ‌యానా భ‌ర్త చ‌నిపోయాని తెలిసినా ఆ బాధ‌ను దిగ‌మింగింది. అలాంటి స్థితిలోనే న్యూస్ రీడ‌ర్‌గా త‌న బాధ్యత నిర్వ‌హించింది. అలా వార్త‌లు చ‌దివే క్ర‌మంలో త‌న భ‌ర్త చ‌నిపోయాడ‌న్న వార్త‌ను కూడా ఆమె చ‌ద‌వాల్సి వ‌చ్చింది. తాజాగా ఐబీసీ 24 చాన‌ల్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

చ‌త్తీస్‌గ‌డ్‌కు చెందిన ఐబీసీ 24 చాన‌ల్ న్యూస్ రీడ‌ర్ సుప్రీత్ కౌర్ ఈ నెల 8వ తేదీన ఉద‌యం వార్తలు చ‌దువుతోంది. కాగా మ‌హ‌సాముండ్ జిల్లా పిథారా ప్రాంతంలో జాతీయ ర‌హ‌దారిపై రెనాల్ట్ డ‌స్ట‌ర్ కారు మ‌రో వాహ‌నాన్ని ఢీకొని ప్ర‌మాదానికి గురైంద‌ని ఫోన్ వ‌చ్చింది. ఆ కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గ‌రు చ‌నిపోయార‌ని, ఇద్దరికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని రిపోర్ట‌ర్ చెప్పాడు. ఇదే మార్గంలో త‌న భ‌ర్త హ‌ర్ష‌ద్ క‌వాడే రెనాల్ట్ డ‌స్ట‌ర్ కారులో వెళ్తున్నాడు. ప్ర‌మాదానికి గురైన కారు త‌న భ‌ర్త‌దే అని సుప్రీత్‌కు అర్థం అయింది. దీంతో ఆమె తీవ్రంగా షాక్‌కు లోనైంది.

అయితే ఉబికి వ‌స్తున్న దుఃఖం బ‌య‌ట‌కు క‌నిపించ‌కుండా ఆమె వార్త‌ల‌ను మామూలుగానే చదివింది. త‌న వృత్తి ప‌ట్ల ఉన్న అంకిత‌భావాన్ని చూపింది. బులెటిన్ పూర్తి చేసిన త‌రువాత బోరున విల‌పించింది. బంధువుల‌కు ఫోన్ చేసి జ‌రిగిన విష‌యాన్ని చెప్పింది. సుప్రీత్ వార్త చ‌దువుతున్న‌ప్పుడు ఆమె భ‌ర్త ప్ర‌మాదంలో చ‌నిపోయాడ‌ని మాకు తెలుసు. కానీ ఆ విష‌యం ఆమెకు చెప్పేందుకు ధైర్యం చాల‌లేదు, అని చాన‌ల్ ఎడిట‌ర్ చెప్పాడు. కాగా సుప్రీత్‌కు ఏడాది క్రిత‌మే వివాహం జ‌రిగింది.

Share.

Comments are closed.