నన్ను న‌మ్మ‌నివాళ్లు న‌ర‌కానికి పోతారు! : వ‌ర్మ‌

0

నన్ను న‌మ్మ‌నివాళ్లు న‌ర‌కానికి పోతారు! : వ‌ర్మ‌

త‌న ట్వీట్ల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో ఉండే రాంగోపాల్ వ‌ర్మ తాజాగా మ‌రో ట్వీట్‌తో వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఓ వీడియోను తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ గతంలో మాదిరిగానే చమత్కరించారు. ఈ వీడియోలో వర్మ గురించి, ఆయన తీస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం గురించి ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ వాయిస్ వినబడుతుంది. ఆ వాయిస్ గురించి చెప్తూ ‘సాక్షాత్తూ ఎన్టీఆర్ గారే నాకీ సందేశాన్ని ఆకాశవాణి ద్వారా పంపారు. ఇది నమ్మని వాళ్లందరూ కచ్చితంగా నరకానికి పోతారని కూడా చెప్పమన్నారు’ అని వర్మ తన పోస్ట్ చేశాడు.

‘రామ్ గోపాల్ వర్మ గారూ!, మిత్రులు అక్కినేని నాగేశ్వరరావు గారు పరిచయం చేయగా గతంలో మీరొకసారి మమ్మల్ని కలిశారు. మేము కరచాలనం చేశాం. మీ ప్రతిభను గురించి, మీ మేథస్సును గురించి, మీ ప్రజ్ఞాపాటవాలను గురించి, మీ వ్యక్తిత్వాన్ని గురించి అక్కినేని నాగేశ్వరరావుగారు ఆనాడే నాకు మీ పరోక్షంలో వివరించారు.

that people gone to hell those are not trust my words

that people gone to hell those are not trust my words

నేను ఇలా అశరీరవాణిగా మీకు వినిపించడానికి కారణం మీరు మాపై తీస్తున్న చలనచిత్రం. మరుగునపడబోతున్న చారిత్రక సత్యాలను మరుగున పెడుతున్నవారు బతికుండగానే తెరకు ఎక్కించే ప్రయత్నం చేయడం నిజంగా సాహసం..సాహసం..సాహసం.

మీ సాహసాన్ని ప్రశంసించడంతో పాటు మీకు, ఈలోకానికి నా అర్థాంగి లక్ష్మీకి కూడా తెలియని కొన్ని అతిముఖ్యమైన విషయాలను మీకు చెప్పదలచాను….ఎప్పుడేది అవసరమో మాకే తెలియును గనుక ఆవిషయాలను మేమే ఇలా అశరీరవాణి ద్వారా మీకు మాత్రమే వినిపించి చెబుతాం.. మీ చిత్రం వెనుక‌ ఇలా అమరిపురి ధామంలో అనిర్వచనీయమైన గౌరవాదరణలు అందుకుంటూ, స్వర్గాధినేతతో సమానమైన మన్ననలు స్వీకరిస్తున్నా మేమూ ఉన్నామని ఈ ఒక్క పర్యాయం అందరికీ వినిపిస్తున్నాం.. ఇకపై మా ఏకాంత సంభాషణ మీతోనే!’ అని ఆ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తుంది.

Share.

Comments are closed.