ఈ గింజ‌ల‌తో చేసిన నీటిని తాగితే కిడ్నీలో రాళ్లు మ‌టాష్‌..!

0

home remedies with barley waterగోధుమ‌ల‌ను మీరు చూశారు క‌దా. బార్లీ గింజ‌లు కూడా అచ్చం అలాగే ఉంటాయి. అయితే గోధుమ‌ల క‌న్నా బార్లీ గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో లాభం చేకూరుస్తాయి. వీటిలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు ఉన్నాయి. కొవ్వును అదుపులో ఉంచి, బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ మంచి పరిష్కారం. బార్లీ నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అనేక అనారోగ్యాలను దూరం చేస్తే శక్తి ఇందులో ఉందని అంటున్నారు. ఆయుర్వేదంలో బార్లీ గింజ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ప‌లు రోగాల‌ను న‌యం చేయ‌డానికి వీటిని వాడుతారు. బార్లీ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక పాత్రలో లీటరు మంచినీటిని తీసుకొని, అందులో గుప్పెడు బార్లీ గింజలను వేయాలి. 20 నిమిషాలపాటు ఈ నీటిని బాగా మరిగించాలి. దీంతో బార్లీ గింజలు మెత్తగా మారి, వాటిలోని పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. తర్వాత ఆ నీటిని చల్లార్చి కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవాలి. ఈ నీటిని నిత్యం ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా బార్లీ నీటిని తాగ‌డం వ‌ల్ల కింద చెప్పిన అద్భుత ఫ‌లితాలు క‌లుగుతాయి.

1. చిన్నపిల్లలకు బార్లీ నీటిని తాగించడం వల్ల మూత్రం చెడువాసన రాదు.

2. బార్లీ నీటిని పరగడుపునే తాగితే శరీరంలోని వ్యర్థ, విష పదార్థాలన్నీ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రప‌డి కోలన్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

3. హార్మోన్లకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్నవారు బార్లీ నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది. హార్మోన్లు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి.

4. తిన్న ఆహారం గొంతులోకి వచ్చినట్లుగా ఉండేవారికి బార్లీ నీరు మంచి ఫలితాలనిస్తుంది. కడుపులో మంట, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోయి జీర్ణాశ‌యం శుభ్ర‌మ‌వుతుంది.

5. వేడి చేసినవారు బార్లీ నీటిని తాగడం ద్వారా ఉపశ‌మ‌నం పొందవచ్చు. ప్ర‌ధానంగా ఎండాకాలంలో ఈ నీరు బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

home remedies with barley water

6. బార్లీ నీటిలో సహజసిద్ధంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాల వల్ల కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

7. బార్లీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

8. బరువు తగ్గాలనుకునేవారికి బార్లీ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర మెటబాలిజాన్ని క్రమబద్ధీకరిస్తాయి. దీంతో బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

9. మధుమేహం ఉన్నవారు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది. ఇందులో ఉండే బీటా గ్లూకాగాన్ గ్లూకోజ్ గ్రహించడాన్ని ఆలస్యం చేస్తుంది. దీని వల్ల రక్తంలో చక్కెర నిల్వలు పెరిగే అవకాశం తగ్గుతుంది.

10. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు ధరిచేరవు. బీపీ కూడా అదుపులో ఉంటుంది.

11. బార్లీ నీటికి కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.

12. గర్భవతులు బార్లీనీటిని తాగితే మూత్రాశయ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. బాలింతలకు బార్లీ నీటిని తాగిస్తే పాలు బాగా పడతాయి. జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది.

Share.

Comments are closed.