రూ.2 ల‌క్ష‌లకు మించిన న‌గ‌దు లావాదేవీల‌పై 100 శాతం ఫైన్

0

100 percent fine on cash transactions above rs 2 lakhs, people have to pay fine

ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ్యాంకులు క‌స్ట‌మ‌ర్ల‌పై ఎలాంటి చార్జిలు మోప‌నున్నాయో అంద‌రికీ తెలిసిందే. 5 ఏటీఎం లావాదేవీలు దాటితే వీర బాదుడు బాదేందుకు సిద్ధ‌మ‌య్యాయి. దీంతోపాటు బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ లేక‌పోయినా క‌స్ట‌మ‌ర్ల న‌డ్డి విరిచేందుకు బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయి. అయితే ఈ షాక్ నుంచి తేరుకోక‌ముందే ప్ర‌జ‌ల‌కు మ‌రో షాక్ త‌గిలేలా ఉంది. అదే న‌గ‌దు లావాదేవీల‌పై ప‌రిమితి.!

ఇక‌పై బ్యాంకుల్లో రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే న‌గ‌దు లావాదేవీల‌కు అనుమ‌తి ఉంటుంది. అంతకు మించి ఆన్‌లైన్ లో లావాదేవీలు నిర్వ‌హించాల్సిందే. ఒక వేళ ఎవ‌రైనా ఈ నిబంధ‌న‌ను మీరితే వారిపై 100 శాతం చార్జి వేయ‌నున్నారు.

100 percent fine on cash transactions above rs 2 lakhs, people have to pay fine

అయితే గ‌తంలో ఈ న‌గ‌దు ప‌రిమితిని రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంచాల‌ని నిర్ణ‌యించారు. కానీ తాజాగా దాన్ని రూ.2 ల‌క్ష‌ల‌కు మార్చారు. దీంతో రూ.2 ల‌క్ష‌ల‌కు న‌గదు లావాదేవీ మించితే వారు 100 శాతం ఫైన్ క‌ట్టాల్సిందే. అవినీతి నిర్మూల‌న కోస‌మే ఈ చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని సంబంధిత శాఖ చెబుతుండ‌గా, ఈ నిబంధ‌న‌పై జ‌నాల నుంచి ఇక ఏ విధ‌మైన స్పంద‌న వ‌స్తుందో వేచి చూడాలి.

Share.

Comments are closed.