ప్రజా నాయకుడి గురించి తప్పుగా మాట్లాడితే ఖబడ్దార్..!

0

ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు ఉన్న నాయకులకే పదవులు దక్కుతాయి. నీతి, నిజాయితీలతో వ్యవహరించే నాయకులనే ప్రజలు తమ ప్రతినిధులుగా ఎన్నుకుని చట్టసభలకు పంపుతారు. అలా కాకుండా అవినీతి ఆరోపణలతో, పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు మారే నాయకులను ప్రజలు తిప్పికొడతారు. వారికి గట్టి బుద్ధి చెబుతారు. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ప్రజాభిమానం ఉన్న ఓ నాయకుడిపై అర్థం పర్థం లేని అవినీతి ఆరోపణలు చేయడం, బురద చల్లడం, పొంతన లేని వ్యాఖ్యలు చేయడం సబబు కాదు. ఒక వేళ నిజంగా అవినీతికి పాల్పడ్డాడనే విషయం నిజమే అయితే దాన్ని నిరూపించాలి.

అప్పుడే అలాంటి అవకాశవాద నాయకుల వాదన నిజమై ప్రజలు కొంత వరకైనా వారిని నమ్మే అవకాశం ఉంటుంది. అది తెలుసుకోకుండా కేవలం పదవి కోసం ప్రజా నాయకుడి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చెల్లదు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. ముఖ్యంగా ఆ నేతను నమ్ముకున్న వాళ్లు ఇలాంటి వారి మాటలకు భయపడరు.అది గుర్తుంచుకుని మెలిగితే మంచిది..!

Share.

Comments are closed.